బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (12:04 IST)

అశ్లీల వెబ్‌సైట్‌లు చూస్తూ.. బ్లాక్‌మెయిల్‌.. నగ్నంగా మాట్లాడాలని...?

అశ్లీల వెబ్‌సైట్‌లలో ఫోన్‌ నెంబర్‌ పెడుతానని బ్లాక్‌మెయిల్‌ చేసిన ఓ యువకుడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కృష్ణాజిల్లా పామురు మండలానికి చెందిన సోమసుందర సాయి ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. సోమసుందర్‌ సాయి బూతు వీడియోలు చూడటానికి బానిసయ్యాడు. ఇన్‌స్టాగ్రాంలో ఓ యువతితో పరిచయం ఏర్పడింది.
 
దీంతో ఆ యువతిని వీడియో కాల్‌ ద్వారా నగ్నంగా మాట్లాడాలని బెదిరించగా.. ఆ యువతి అతన్ని బ్లాక్‌ చేసింది. దీనిపై కోపం పెంచుకుని మహిళ పేరు మీద మరో ఇన్‌స్టాగ్రాం ఐడీ సృష్టించి యువతితో మాట్లాడాడు. ఆ తర్వాత నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడాలని వేధించాడు. 
 
దీనికి యువతి స్పందించకపోవడంతో అతని నగ్న వీడియోను పంపి ఇబ్బంది పెట్టాడు. దీంతో యువతి రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు సోమసుందర్‌ సాయిని అరెస్టు చేశారు. వేధింపులకు వాడిన మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.