గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (09:15 IST)

పొలంలో 5 కిలోల బంగారం, 2 కిలోల వెండితో లంకె బిందె, అన్నీ అమ్మవారి నగలే...

పొలంలో భూమిని చదును చేస్తుండగా బంగారు బిందె బయటపడింది. అందులో 5 కిలోల బంగారం, 2 కిలోల వెండి వున్నది. ఈ బిందెను చూసిన భూ యజమాని అధికారులకు సమాచారం ఇచ్చారు.
 
వివరాలు చూస్తే.. జనగామ జిల్లా పెంబర్తిలో గురువారం నాడు ఓ లంకెబిందె వెలుగుచూసింది. హైదరాబాదు నగరానికి చెందిన నర్సింహ అనే వ్యక్తి పెంబర్తి పరిధిలో వున్న 11 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందులో వెంచర్ వేసేందుకు భూమిని జెసిబితో చదును చేయిస్తున్నాడు. ఆ సమయంలో జెసిబికి లంకెబిందె తగిలింది.
 
 ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయగా వారు వచ్చి బిందెను తెరిచి చూడగా అందులో 5 కిలోల బంగారం, 2 కిలోల వెండి వున్నట్లు కనుగొన్నారు. కాగా తనకు గత కొన్నిరోజులుగా అమ్మవారు కలలోకి వస్తోందనీ, తన భూమిలో అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తానని యజమాని చెప్పాడు. కాగా లంకెబిందె బయటపడటంతో పురావస్తు శాఖ అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు.