శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (19:14 IST)

బుమ్రా ఆన్‌ఫీల్డ్ మూడ్, రోజూ నా మూడ్ ఒకేలా ఉన్నాయ్.. సంజన

Bumrah_Sanjana
టీమిండియా క్రికెటర్ బుమ్రా పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మార్చి 14-15న బుమ్రా వివాహం గోవాలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా సంజన చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతున్నాయి. 
 
జనవరిలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరిగే సమయంలో బుమ్రా ఎక్స్‌ప్రెషన్స్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి మీ ఆదివారం బుమ్రా కంటే బాగా గడిచిందా అని కామెంట్ పెట్టింది. కాగా దానికి సంజనా కామెంట్ పెట్టింది. 
 
బుమ్రా ఆన్‌ఫీల్డ్ మూడ్, రోజూ నా మూడ్ ఒకేలా ఉన్నాయంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా మరోవైపు సంజనాను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసినప్పటి నుంచి ఆమెకు కంగ్రాట్స్ మెసేజ్‌లు వెళ్లువెత్తుతున్నాయి.
 
కాగా బుమ్రా చేసుకోబోయే అమ్మాయి ఎవరన్న చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతుంది. ఈ క్రమంలో అనుపమ పరమేశ్వరన్ పేరు వినిపించింది. గతంలో అనుపమ, బుమ్రా ప్రేమలో ఉన్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ నడిచింది. 
 
అయితే ఆ వార్తలపై అనుపమ తల్లి స్పందిస్తూ.. వాటిని కొట్టిపారేశారు. ఇప్పట్లో అనుపమకు పెళ్లి చేసే ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. ఇక ఆ తరువాత మోడల్, స్పోర్ట్స్ కామెంటేటర్ సంజనా గణేషన్ పేరు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.