గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 డిశెంబరు 2021 (08:38 IST)

హైదరాబాద్‌లో బద్వేల్ వైద్యుడు ఆత్మహత్య - సెలైన్‌లో విషం...

హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా బద్వేల్‌కు చెందిన వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సెలైన్‌లో విషం కలిపి, దాన్ని తన శరీరంలోకి ఎక్కించుకున్నారు. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన రాజ్‌కుమార్ (29) అనే వైద్యుడు హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలోని శ్యామ్ కరణ్ అనే ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఈయన బీకేగూడలో అద్దెకు ఉంటున్నారు. అయితే, శుక్రవారం రాత్రి తన స్నేహితులకు ఫోన్ చేసి తన మనసేం బాగాలేదని చెప్పాడు.
 
ఆ తర్వాత వైద్యుడికి ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆ స్నేహితుడు మరో వైద్యుడికి సమాచారం అందించారు. ఆ వెంటనే రాజ్‌కుమార్ గదికి వచ్చి చూడగా, ఆయన చేతికి సెలైన్‌తో అపస్మారక స్థితిలో కనిపించారు. 
 
ఆ వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రాజ్‌కుమార్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.