శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 డిశెంబరు 2021 (19:57 IST)

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు: పేరెంట్స్‌కి చెబితే...

మహిళ స్నానం చేస్తుండగా ఆమె వీడియోలను తీసాడు ఓ యువకుడు. తను స్నానం చేస్తుండగా ఏదో అలికిడి అనిపించడంతో మహిళ పైకి చూడగా యువకుడు వీడియో తీస్తూ కంపడ్డాడు. వెంటనే ఈ విషయాన్ని ఆమె భర్తకి తెలిపింది.

 
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ ఫిలింనగర్ లోని మాగంటి కాలనీలో 35 ఏళ్ల మహిళ స్నానం చేస్తోంది. ఈ సమయంలో ఆ ఇంటి యజమాని కొడుకు సెల్ ఫోన్ వీడియో తీస్తుండగా ఆమె దాన్ని గమనించింది. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్‌కి విషయాన్ని తెలిపింది.

 
ఇంటి యజమానికి చెబితే... తమ కుమారుడు అలాంటివాడు కాదంటూ బుకాయించారు. దీనితో ఫలితం లేకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తను గత మూడు నెలలుగా ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీస్తున్నట్లు అతడు అంగీకరించాడు. దీనితో అతడి తల్లిదండ్రులు షాక్ తిన్నారు.