గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 జూన్ 2021 (16:51 IST)

బ్యాంక్ ఫ్రాడ్ కేసు.. టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ సమన్లు..

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చుట్టు ఉచ్చు బిగిసుకుంటోంది. తాజాగా ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరు కావాలని నామాకు ఈడీ సమన్లు పంపింది. 
 
బ్యాంకు రుణాలను మళ్ళీంచిన కేసులో నామా నాగేశ్వరరావుకు సమన్లు జారీ చేసింది ఈడీ. మదుకాన్ కేసులో నిందితులందరికీ సమన్లు ఇచ్చిన ఈడీ.. మదుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఇటీవల రెండు రోజుల పాటు సోదాలు జరిపింది. సోదాల్లో భారీగా దస్త్రాలు, లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకుంది ఈడీ. ప్రస్తుతం దస్త్రాలు, ఖాతాలు, హార్డ్ డిస్కులను ఈడీ బృందాలు విశ్లేషిస్తున్నాయి.
 
కాగా జూన్ 11న ఎంపీ నామా నాగేశ్వర రావు ఇంట్లో మొదటగా ఈడీ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ముమ్మర సోదాలు చేశారు ఈడీ అధికారులు. అంతేకాదు.. నామాకు చెందిన ఖమ్మం, హైదరాబాద్‌లలో ఉన్న ఆఫీసుల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు.