మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (06:52 IST)

బీరువాను తెరిచి చూడగానే చిట్టి గుండె తట్టుకోలేక పోయింది.. అసలేం జరిగింది?

ఓ దొంగ ఓ ఇంటికి దొంగతనానికి వెళ్లాడు. చాకచక్యంగా ఇంట్లోకి వెళ్ళాడు. బీరువా తెరిచి చూడగానే ఆ దొంగ చిట్టిగుండె తట్టుకోలేక పోయింది. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బీరువా ముందే కుప్పకూలిపోయాడు. దీనికి కారణంగా బీరువాలో ఉన్న నోట్ల కట్టలను చూడగానే ఒక్కసారిగా నోరెళ్లబెట్టి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. బిజ్నర్ జిల్లాకు చెందిన నవాబ్ హైదర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న పబ్లిక్ సర్వీస్ కేంద్రంలో ఫ్రిబవరి 17న భారీ దొంగతనం జరిగింది. దొంగలు ఏడు లక్షలు దోచుకుపోయారంటూ యజామాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ ఘటనకు సంబంధించి నౌషాద్, అజర్‌లను ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. తామే ఈ దొంగతనానికి పాల్పడ్డామంటూ వారిద్దరూ విచారణలో అంగీకరించారు. అంతేకాకుండా తమలో ఒకరికి హార్ట్ ఎటాక్ వచ్చిన విషయన్నీ బయటపెట్టారు. కేసును చేధించినట్టు బుధవారం నాడు ప్రకటించిన పోలీసులు.. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. 
 
తాము నిర్ధేశించుకున్నదానికంటే అధికంగా డబ్బు దొంగిలించానని తెలుసుకున్న తమ ముఠాలోని ఓ సభ్యుడు సంతోషం పట్టలేక.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సంబరాన్ని తట్టుకోలేక హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలిపారు. అది చాలదన్నట్టు.. వైద్య ఖర్చులు తడిసి మోపెడవడంతో దొంగిలించిన సొమ్ములో అధిక మొత్తం వైద్య ఖర్చులకే సరిపోయిందని వెల్లడించారు. దొంగలు చెప్పిన కథ విని పోలీసులే నోరెళ్లబెట్టారు.