శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (14:36 IST)

వేగంగా లారీని ఢీకొట్టిన కారు: మహిళా ఇంజినీర్ అక్కడికక్కడే మృతి

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కూకట్ పల్లికి చెందిన మహిళా ఇంజినీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
 
పూర్తి వివరాలు చూస్తే.. గోవా నుంచి తన స్నేహితులతో మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిహారిక కారులో బయలుదేరింది. కారును ఆమే స్వయంగా నడుపుతోంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలఘాట్ చౌరస్తా 65 నంబర్ జాతీయ రహదారి పక్కనే ఆగి వున్న లారీని వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీనితో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది.
 
నిహారిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహం కారు శకలాల్లో ఇరుక్కుపోయింది. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.