శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 సెప్టెంబరు 2023 (17:16 IST)

తమ శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

image
నేటి విద్యార్థులలో అసాధారణ ప్రతిభ వుంది. చేయాల్సిందల్లా వారి ప్రతిభకు మెరుగులద్దటం, వారి నైపుణ్యం ప్రదర్శించుకునే వేదిక అందించటం. అలాంటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నైపుణ్యాలు, అత్యుత్తమ ఆలోచనలను ప్రదర్శించేందుకు వేదికగా వరంగల్‌లో నిర్వహించిన NXplorers కార్నివాల్ నిలిచింది. 
 
బయో గ్యాస్‌ను వంట చేసుకోవటానికి మాత్రమే కాదు, విద్యుత్‌గా కూడా మార్చవచ్చు అని కాజీపేటలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే (MJP) స్కూల్ (బాలికలు) చూపితే, పెద్దాపూర్‌లోని MJP(గర్ల్స్) స్కూల్‌చే అభివృద్ధి చేయబడిన తరగతి గది హెచ్చరిక అలారం వ్యవస్థ, ఆ విద్యుత్‌ని ఎలా ఆదా చేయవచ్చో చూపింది. MJP (బాయ్స్), కమలాపూర్ తీర్చిదిద్దిన సేంద్రీయ నీటి శుద్దీకరణ ప్రాజెక్ట్ కార్న్ కాపర్‌ను ఉపయోగించి సేంద్రీయ నీటి శుద్దీకరణను చూపితే, మరిడ్‌పెడలోని MJP స్కూల్ నుండి సోలార్ డ్రిప్ ఇరిగేషన్ మోడల్‌ను ప్రదర్శించింది.
 
ఇవేనా వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాం మరియు భూపాలపల్లి వంటి ఐదు జిల్లాలకు చెందిన పలు MJP ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 146 మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులు స్టెమ్ ( సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితం) విభాగంలో తమ వినూత్న ఆలోచనలను ఇక్కడ ప్రదర్శించారు. వందలాది ఎంట్రీల నుండి ఎంపిక చేయబడిన మొత్తం 48 "మార్పు ప్రాజెక్ట్‌లు" ఇక్కడ ప్రదర్శించబడ్డాయి.
 
షెల్‌కు చెందిన గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ సోషల్ ఇన్వెస్ట్‌మెంట్ స్టెమ్ విద్యా కార్యక్రమం NXplorers జూనియర్ ప్రోగ్రామ్. ఇది యునైటెడ్‌నేషన్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGలు)లో వెల్లడించినట్లుగా, స్థానిక మరియు గ్లోబల్ సవాళ్లను అర్థం చేసుకోవడం, నావిగేట్ చేయడం మరియు పరిష్కరించడం ద్వారా పాఠశాల పిల్లలకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం జాతీయ విద్యా విధానం 2020కి కూడా అనుగుణంగా ఉంది.
 
స్మైల్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని అవిభాజ్యపు వరంగల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలతో పాటుగా కేరళలోని త్రిసూర్ జిల్లాలో మొత్తం 203 పాఠశాలల్లో అమలు చేస్తోంది. ఇది 6 మరియు 7 అకడమిక్ గ్రేడ్‌లలోని 10 నుండి 12 సంవత్సరాల వయస్సు గల 25,000 మంది పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తోంది. వరంగల్ కార్నివాల్‌లో ప్రదర్శించిన నమూనాలతో అధిక శాతం పర్యావరణ పరిరక్షణ మరియు నీరు, శక్తి, ఆహారం వంటి వనరుల మెరుగైన వినియోగంపై వున్నాయి.