గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (11:53 IST)

ఇలాంటి పాలన వస్తుందని ఊహించలేదు: బండి సంజయ్

తెలంగాణ సాధిస్తే కుటుంబ పాలన వస్తుందని ఎవ్వరూ ఊహించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.  ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబం సమానత్వం కోసం పాలన కొనసాగుతుందని విమర్శించారు.

ఈ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో పాలన కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాసామ్యనికి ప్రతీకగా మోదీ పాలన కొనసాగుతుందని చెప్పారు.

దేశంలో రైతులను ఆదుకునేందుకు కేంద్రం చట్టాలు తెస్తే... కొన్ని రాజకీయ పార్టీలు దానికి వ్యతిరేకంగా డమ్మీ ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర వ్యవసాయ చట్టానికి తెలంగాణ రైతులు పూర్తి మద్దతు తెలుపుతున్నందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలియజేశారు.