బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: గురువారం, 23 ఫిబ్రవరి 2017 (14:24 IST)

అదీ కేసీఆర్ దెబ్బంటే... కోదండరామ్ ఇక ఒంటరే... టీజేఏసీలో లుకలుకలు...

తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్. ఉద్యమ సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా ఆయన జైత్రయాత్ర సాగుతోంది. తెలంగాణలో విపక్షాలు ఏ సమస్యపై మొరపెట్టుకున్నా... వాళ్ల మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో

తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్. ఉద్యమ సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా ఆయన జైత్రయాత్ర సాగుతోంది. తెలంగాణలో విపక్షాలు ఏ సమస్యపై మొరపెట్టుకున్నా... వాళ్ల మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన ప్రొ.కోదండరాం నిరుద్యోగుల సమస్యలపై సమరశంకం పూరించారు. ఐతే ర్యాలీ నిర్వహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. దీనితో టీజేఏసీ కోర్టుకెక్కింది. 
 
నాగోల్‌లో ర్యాలీ నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఐతే కోదండరాం దీనికి విముఖత తెలిపారు. నగరంలోనే ర్యాలీ నిర్వహించాలని మొండికేశారు. దీనిపైనే ఇపుడు టీజేఏసీలో రచ్చ అయింది. కోదండరాం నిర్ణయంపై జేఏసీ కన్వీనర్ రవీందర్ అసహనం వ్యక్తం చేశారు. బాహాటంగా విమర్శలు చేశారు. ఆయనతోపాటు మరికొందరు గళం కలిపారు. మొత్తమ్మీద ర్యాలీ చేసి గంటలు కూడా కాకమునుపే జేఏసీలో లుకలుకలు చూస్తుంటే కేసీఆర్ అంటే మజాకా అని అర్థమవుతుంది కదూ. భవిష్యత్తులో ఇక కోదండరాం ఒంటరిగా మిగులుతారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.