ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By TJ
Last Modified: సోమవారం, 17 జులై 2017 (13:50 IST)

డ్రగ్స్ కేసు... టాలీవుడ్ అగ్రహీరోల్లో మరో హీరో వున్నారట... పేరు చెబ్తే భారీ కుదుపేనట...

డ్రగ్స్ వ్యవహారంలో సినీప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 8 మంది పేర్లు బయటకు రాగా ఇక మిగిలింది రెండవ జాబితానే. రెండవ జాబితాలో ఒక ప్రముఖ నటుడి పేరు ఉన్నట్లు సమాచారం. అయితే ఆ పేరును జాబితాలో ప్రకటించాలా వద్దా అని తెలంగాణ ఎక్సైజ్‌

డ్రగ్స్ వ్యవహారంలో సినీప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 8 మంది పేర్లు బయటకు రాగా ఇక మిగిలింది రెండవ జాబితానే. రెండవ జాబితాలో ఒక ప్రముఖ నటుడి పేరు ఉన్నట్లు సమాచారం. అయితే ఆ పేరును జాబితాలో ప్రకటించాలా వద్దా అని తెలంగాణ ఎక్సైజ్‌తో పాటు, అధికారులు ఆలోచనలో పడ్డారు. ప్రముఖ నటుని పేరు ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర చర్చనీయాంశంగా మారి, సినీ రంగాన్ని కుదిపేస్తుందన్న ఆలోచనలో ఉన్నారట. 
 
గత వారం క్రితం డ్రగ్స్ తీసుకుంటున్న సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చి తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కెల్విన్ అనే డ్రగ్స్ సూత్రధాని వారి పేర్లను బయటకు తీసుకొచ్చాడు. అయితే కెల్విన్ ఫోన్లో మరికొంతమంది ప్రముఖు సినీనటుల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒక అగ్రహీరో పేరు ప్రధానంగా ఉందట. అయితే ఆయన అటు రాజకీయాల్లోను, ఇటు సినిమాల్లో ప్రముఖుడేనని వార్తలు వస్తున్నాయి. అందుకే ఆ హీరో పేరు చెప్పకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.