ఏపీ ప్రజల గాలి మళ్లిందా.. కేసీఆర్ లాంటి సీఎమ్మే కావాలనుకుంటున్నారా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల విశ్వాసం పొందలేక టీడీపీ అధినేత చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తూ జనాన్ని మభ్యపెడుతున్నారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. చంద్రబాబును రెండు రాష్ట్రాల ప్రజలు అసహ్యించుకుంటున్నారని, కేసీఆర్ లాంటి సీఎం కావాలని ఏపీ ప్రజలు క
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల విశ్వాసం పొందలేక టీడీపీ అధినేత చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తూ జనాన్ని మభ్యపెడుతున్నారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. చంద్రబాబును రెండు రాష్ట్రాల ప్రజలు అసహ్యించుకుంటున్నారని, కేసీఆర్ లాంటి సీఎం కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఏపీ, తెలంగాణ విడిపోయి అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా బాబు మాట్లాడటం అభ్యంతరకరంగా ఉందన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి విలేకరు లతో మాట్లాడారు.
‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ చిన్న రాష్ట్రాలే అభివృద్ధిలో ముందున్నాయి. గుజరాత్, ఛత్తీస్‌గఢ్, హరి యాణా.. ఇప్పుడు తెలంగాణ దూసుకుపోతున్నాయి. అభివృద్ధిని చూడలేని అంధుడు చంద్రబాబు. వాస్తవాలను గ్రహించకుండా, తెలంగాణ ఏర్పాటు చీకటి రోజని మాట్లాడడం బాధాకరం. విడిపోయి కలుసుందామన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. పరిపాలన చేసే సత్తా లేక చంద్ర బాబు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు’’ అన్నారు. చేతనైతే అభివృద్ధి, పరిపాలనలో పోటీ పడాలని, కుట్రలు కుతంత్రాల్లో కాదన్నారు.
‘‘చంద్ర బాబు మాటలు పార్లమెంట్‌ను, ప్రజాస్వా మ్యాన్ని అవహేళన చేసేలా ఉన్నాయి. పార్ల మెంట్‌లో ఏకగ్రీవంగా తెలంగాణ బిల్లు ఆమో దం పొందింది. అన్ని పార్టీలు రాష్ట్ర ఏర్పాటు ను ఆమోదించాయి. మీ వెకిలి చేష్టలకు, ప్రలో భాలకు లొంగలేదు. పద్నాలుగు సంవత్స రాల పాటు అన్ని పార్టీలను కలిసిన కేసీఆర్ తొక్కని గడపలేదు.. ఎక్కని మెట్టు లేదు. ఆర్‌ఎస్‌యూ నుంచి ఆరెస్సెస్ వరకూ అంద రినీ ఒప్పించాం. మాకు బేషజాలు, పంతాలు, రాజకీయాలు లేవు. తెలంగాణ అభివృద్దే లక్ష్యం. విడిపోయిన రెండు సంవత్సరాల్లోనే రెండు రాష్ట్రాలు రెండు లక్షల అరవై వేల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే అందుకు నిదర్శ నం. ఈ వాస్తవాలను మరచిపోయి మాట్లాడ డం దురదృష్టకరం’’ అన్నారు.
తెలంగాణ లోనూ చంద్రబాబు వందిమాగధులు అవాకులుచెవాకులు పేలుతూ, ప్రజలను రెచ్చగొ డుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని, వారికి తగిన గుణపాఠం తప్ప దని హెచ్చరించారు.