తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్లతో ఈ బడ్జెట్‌ను ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. మూలధన వ్యయం కింద రూ.2,11,685 కోట్లు, పెట్టుబడి వ్యయం పద్దుగా రూ.37,525 కోట్లను కేటాయించినట్టు తెలిపారు. హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో వివిధ రంగాలకు కేటాయించిన పద్దులను ఓసారి పరిశీలిస్తే,
ఆర్థిక శాఖకు రూ.49,749 కోట్లు
నీటి పారుదల రంగం రూ.26,885 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు
విద్యాశాఖకు రూ.19,093 కోట్లు
విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు
వైద్య రంగానికి రూ.12,161 కోట్లు
హోంశాఖకు రూ.9,599 కోట్లు
ఆరోగ్య శ్రీ పథకానికి రూ.1463 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,327 కోట్లు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ.4,834 కోట్లు
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ.12,000 కోట్లు
ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు రూ.366 కోట్లు
రైతుబందు పథకానికి రూ.15,075 కోట్లు
ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
ప్రణాళిక విభాగానికి రూ.11,495 కోట్లు
రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు
రైతుబీమా పథకానికి రూ.1589 కోట్లు
గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ.3,210 కోట్లు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ.200 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131 కోట్లు.
ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ.2,200 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ.2,200 కోట్లు
హరితహారం పథకానికి రూ.1471 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
దళితబంధు కోసం రూ.17,700 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ.12 వేల కోట్లు
అటవీ శాఖ కోసం రూ.1,471 కోట్లు
ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు