గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : ఆదివారం, 28 అక్టోబరు 2018 (13:24 IST)

సూర్యపేటలో హైటెక్ వ్యభిచారం.. రెగ్యులర్ కస్టమర్స్ జాబితాలో మంత్రుల పేర్లు!

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో హైటెక్ వ్యభిచార గుట్టుబట్టబయలైంది. ఇందులో ఆశ్చర్యపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. వ్యభిచార కేంద్రం నిర్వాహకుల మొబైల్స్ ఫోన్లలో రెగ్యులర్ కస్టమర్స్ జాబితాలో పలువురు తెలంగాణ మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, పోలీసుల పేర్లు ఉన్నాయి. ఈ వాట్సాప్ గ్రూపును చూసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక్కసారి అవాక్కయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సూర్యాపేట జిల్లాలోని కోదాడలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం సాగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. కోదాడలోని కట్టకొమ్మగూడెం రోడ్డులో దీక్షిత్‌, ఈశ్వరమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న వీరు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు యువతులతో వ్యభిచారం నిర్వహించడం మొదలుపెట్టారు. 
 
అమ్మాయిల ఫొటోలను వాట్సాప్ ద్వారా విటులకు పంపి డీల్ ఖరారు చేసేవారు. ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దీక్షిత్ ఇంటిపై దాడులు నిర్వహించారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఓ యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఈ సందర్భంగా నిందితుల ఫోన్లను పరిశీలించిన పోలీసులు విస్తుపోయారు. దీక్షిత్ దంపతులు 'రెగ్యులర్ కస్టమర్స్' పేరుతో ఏకంగా ఓ వాట్పాప్ గ్రూపును నడుపుతున్నట్లు గుర్తించి ఇందులో ప్రజా ప్రతినిధులు, నేతలు, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు వీరి కస్టమర్లుగా ఉన్నట్లు గుర్తించి షాక్‌కు గురయ్యారు.