సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శనివారం, 4 మే 2019 (16:30 IST)

ఆ మత్తు పీల్చితే 5 గంటలపాటు మహిళల్లో కోర్కెలు... డ్రగ్స్ ముఠా అరెస్ట్

వయస్సు అయిపోయేకొద్దీ శృంగారంపై శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు కొంతమందికి అసలు శృంగార కోరికలు తక్కువగా ఉంటాయి. అలాంటి వారి కోసం ఒక ముఠా డ్రగ్స్‌ను తయారుచేసి లక్షల రూపాయలు సంపాదిస్తోంది. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో పోలీసులు ఈ ముఠా ఆగడాలను గుర్తించగా, ఆ ముఠా తెలంగాణాలో కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
 
హైదరాబాద్‌లోని నాచారంలో ఫ్యాక్టరీ. ఒక్కసారిగా జనమంతా గుమిగూడారు. మొత్తం తెల్లటి పౌడర్. 50 మందికి పైగా పోలీసులు. దీంతో ఏదో జరుగుతోందని ఊహించారు. అనుకున్నట్లుగానే మొత్తం డ్రగ్స్. బెంగుళూరులోని ఒక ముఠాతో కలిసి డ్రగ్స్‌ను తయారుచేస్తున్నాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. 
 
గత ఐదు సంవత్సరాలుగా ఈ బాగోతం సాగుతోంది. అయినాసరే పోలీసులకు, స్థానికులకు తెలియలేదు. ముఠా తయారుచేసే డ్రగ్స్ మహిళలపై ఎక్కువగా ఉపయోగించేవారని పోలీసుల విచారణలో తేలింది. ఈ మత్తు మందు పీల్చితే 5 గంటల పాటు మత్తుగా మహిళల్లో శృంగార కోర్కెలు ఎక్కువగా కలుగుతాయట. దీంతో పోలీసులు ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ డ్రగ్స్ ముఠా సభ్యులున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.