మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: బుధవారం, 4 నవంబరు 2020 (18:35 IST)

నా పక్కన నువ్వు తప్ప ఎవర్నీ ఊహించలేను, అందుకే: ప్రియుడు సుసైడ్

ప్రియురాలు తనకు దక్కలేదన్న బాధతో ఓ యువకుడు పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యను సెల్పీలో రికార్డు చేసారు.
 
ఆ వీడియోలో అతడు తన ప్రియురాలిని ఉద్దేశించి మాట్లాడుతూ... నిన్ను మిస్ అవుతున్నా. నా పక్కన నువ్వు తప్ప ఇంకెవరినీ ఊహించలేను. నువ్వు లేని బతుకు దండగ అనిపించింది. అందుకే చచ్చిపోవాలనుకుంటున్నా. నా చావుకి ఎవ్వరూ కారకులు కాదు.
 
నా ప్రియురాలి తల్లిదండ్రులు చాలా మంచివారు. నన్ను ఒక్కమాట కూడా అనలేదు. కనుక అమ్మానాన్నా వాళ్లనేమీ అనొద్దు. నా ప్రియురాలి లేని జీవితం వ్యర్థమని నేను చనిపోతున్నా. ఇదిగో పురుగుల మందు తాగుతున్నా అంటూ డబ్బా మూత తీసి గటగటా తాగేసాడు. 
 
కాగా 
ఆత్మహత్యకు పాల్పడిన యువకుడిది థరూర్ మండలం ఉప్పేరు గ్రామంగా తెలుస్తోంది.