మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 4 నవంబరు 2020 (17:27 IST)

వివాహితతో ఎంజాయ్ చేస్తూ వీడియోలు తీసిన ప్రియుడు, ఆమెకే పంపి..?

ఆమెకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు. అతనికి పెళ్ళయి ఆరు నెలలే అయ్యింది. అయితే అతనికి తన భార్య కంటే ఎదురింటిలో ఉన్న ఆంటీనే ఎక్కువ ఇష్టపడ్డాడు. ఆమెను ఎలాగోలా మాటల్లో దింపి శృంగారానికి ప్రేరేపించాడు. అలా నెలపాటు ఆమెతో ఎంజాయ్ చేశాడు. ఆ సుఖం అలాగే ఉండాలని భావించి ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీశాడు. చివరకు ఆమె ప్రాణాలు తీసుకునేందుకు కారణమయ్యాడు.
 
తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లా తలవాడికి సమీపంలో ఉన్న ముదియనూర్ గ్రామంలో నివాసముండే శివన్న, కుమారికి 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సాఫీగా సాగిపోతున్న జీవితం. అయితే చెన్నై సిటీ నుంచి బదిలీపై వీరు ఉన్న ఇంటికి ఎదురుగా వచ్చాడు దినేష్.
 
కాంట్రాక్ట్ పద్ధతిపైన వ్యవసాయ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు దినేష్. ఆరు నెలల క్రితమే వివాహమైంది. ఎదురింట్లో ఉన్న కుమారి అప్పుడప్పుడు దినేష్ భార్యతో మాట్లాడడానికి వచ్చేది. ఇలా కుమారిపై దినేష్ కన్నుపడింది. ఎలాగైనా ఆమెను అనుభవించాలనుకున్నాడు.
 
సరిగ్గా నెలక్రితం తన భార్యతో మాట్లాడటానికి కుమారి రాగా ఆ సమయంలో ఆమె కూరగాయల మార్కెట్‌కు వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన దినేష్ రెచ్చిపోయాడు. కుమారిని గట్టిగా కౌగిలించుకున్నాడు. కేకలు వేస్తే గోలవుతుందనుకున్న కుమారి మౌనంగా వుండిపోయింది. అదే అదనుగా ఆమెను లొంగదీసుకున్నాడు.
 
అలా ఆ ఇద్దరూ గ్యాప్ దొరికినప్పుడల్లా దినేష్ ఇంటిలోనే కలిసేవారు. ఇది కాస్త సరిగ్గా రెండురోజుల క్రితం దినేష్ భార్యకు తెలిసింది. ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో దినేష్ మరింత రెచ్చిపోయి ఆమెను తరచూ కుమారిని ఇంటికి రమ్మన్నాడు. ఆమె అందుకు వద్దని చెప్పగా ఆమెతో గొడవకు దిగాడు.
 
ఈ విషయం కాస్తా కుమారి భర్త శివకి తెలియడంతో దినేష్‌తో గొడవపడ్డాడు. దీంతో తన దగ్గర ఉన్న నగ్న వీడియోలను కుమారి వాట్సాప్‌కు పంపాడు దినేష్. తను చెప్పినట్లు వినాలని, తను పిలిచినప్పుడల్లా రావాలని బెదిరించాడు.
 
కుటుంబంలో గొడవ పెద్దది కావడం, బంధువులందరూ హేళనగా మాట్లాడటం, ప్రియుడు టార్చర్ పెడుతుండటం భరించలేక కుమారి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు దినేష్ కారణమని సుసైడ్ లేఖలో పేర్కొంది కుమారి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.