శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 అక్టోబరు 2020 (13:12 IST)

ప్రియురాలిని విడిచి వుండలేక సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు..

వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. వారి ప్రేమపై ఆ దేవుడికే కన్నుపడినట్టుంది. అందుకే అనారోగ్యం రూపంలో ప్రియురాలిని మృత్యువు కాటేసింది. ప్రియురాలు దూరమైందన్న బాధతో పియుడు అన్నపానీయాలు మానేశాడు. ఇక, ప్రియురాలు లేనిదే తాను ఉండలేనని భావించాడు. అంతే.. ఆమె సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మ‌హ‌దేవ్‌పూర్ మండ‌లంలోని కుదురుప‌ల్లి గ్రామంలో ఆదివారం ఉద‌యం చోటుచేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మ‌హేశ్ అనే యువ‌కుడు గ‌త కొంత‌కాలం నుంచి అదే గ్రామానికి చెందిన ఓ యువ‌తిని ప్రేమిస్తున్నాడు. వారిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. 
 
ఒక‌ర్ని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేని ప‌రిస్థితి. వారి అన్యోన్య‌మైన ప్రేమ సాగ‌రంలో విషాదం వాతావ‌ర‌ణం అలుముకుంది. అనారోగ్యంతో ప్రియురాలు మృతి చెందింది. దీంతో మ‌హేశ్ తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. 
 
త‌న ప్రేయ‌సి ఈ లోకాన్ని విడిచిపోవ‌డంతో.. తాను బ‌తికి లాభం లేద‌నుకున్నాడు ప్రియుడు. తాను కూడా త‌న ప్రియురాలి వ‌ద్ద‌కే వెళ్తాన‌ని ఆమె స‌మాధి వ‌ద్ద ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.