చరిత్రలో ఇంతవరకు చూడని విధంగా..: షర్మిల

sharmila
ఎం| Last Updated: శనివారం, 20 మార్చి 2021 (09:50 IST)
ఏప్రిల్‌ 9న ఖమ్మంలో ఏర్పాటు చేయనున్న సభపైన ఆ జిల్లా నేతలతో శుక్రవారం లోట్‌సపాండ్‌లో షర్మిల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చరిత్రలో ఇంతవరకు చూడని విధంగా ఖమ్మం సభ జరగాలని వారికి సూచించారు.

పార్టీ ఏర్పాటు ఉద్దేశాన్ని, పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేసేదీ ఆ సభలో ప్రకటిస్తాననీ షర్మిల చెప్పినట్లు సమాచారం. తాను షర్మిలమ్మ రాజ్యం కోసం రాలేదని, దొరల, కుటుంబ పాలన పోయి, రాజన్న సంక్షేమ పాలన రావడం కోసమే ముందుకు వచ్చానని ఖమ్మం నేతలతో ఆమె అన్నారు.

ఇదిలా ఉంటే ఈ నెలాఖరుకల్లా ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాలకు చెందిన వైఎ‌స్‌ఆర్‌ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు పూర్తి చేసుకుని ఖమ్మం సభ ఏర్పాట్లపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని షర్మిల శిబిరం నిర్ణయించారు.
దీనిపై మరింత చదవండి :