సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (08:58 IST)

గవర్నర్ కు రాజకీయాలు ఆపాదించడం సరి కాదు: పొంగులేటి

తెలంగాణ గవర్నర్ తమిళిసైకు రాజకీయాలు ఆపాదించడం పట్ల బిజెపి కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గతకొద్ది రోజులుగా కరోనా కట్టడికి ఒక వైద్యురాలుగా గవర్నర్ విలువైన సూచనలు చేశారని తెలిపారు. గవర్నర్ పై ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డితో పాటు ఇతర టిఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో చేసిన బేషరతుగా ఉపసంవరించుకోవాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని కోరారు. సోషల్ మీడియాలో పోస్టులను పెట్టిన నేతల ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో విఫలమైన ప్రభుత్వం గవర్నర్ ని టార్గెట్ చేయడం అప్రజాస్వామికం, శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యాంగ పదవిలో ఉండి ఒక వైద్యరాలిగా  ప్రభుత్వానికి, సి ఎస్ కు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు పీరియాడికల్ గా విలువైన సూచనలు చేస్తే  గవర్నర్ ని టార్గెట్ చేయడం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమే అన్నారు. అధికార మదంతో కొందరు టిఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్ లను ముఖ్యమంత్రి చేష్టలుడిగినట్లు చూస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో కేసీఆర్ ఒంటెద్దు పోకడలు అందరూ గమనిస్తూనే ఉన్నారని  పేర్కొన్నారు. టిఆర్ఎస్ నేతల భూకబ్జాల కారణంగానే వరంగల్ నగరం వరదలకు అతలాకుతలమైనదని విమర్శించారు. రాష్ట్రంలో ఎమ్మార్వో లపై ఏసీబీ దాడులు కేసీఆర్ అవినీతి పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్ లను బిగించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.