1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : గురువారం, 6 మార్చి 2025 (15:20 IST)

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

Nayanthara, Sundar C, Regina Cassandra, Khushbu, Meena and others
Nayanthara, Sundar C, Regina Cassandra, Khushbu, Meena and others
నయనతార తన రూ.100 కోట్ల ప్రాజెక్టు అయిన మూకుత్తి అమ్మన్ 2 పూజకు హాజరయ్యారు. మూకుత్తి అమ్మన్ 2 మార్చి 6న చెన్నైలో ప్రారంభమైంది. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న నయనతార చిత్రం మూకుత్తి అమ్మన్ 2 ఈరోజు సెట్స్ పైకి వెళుతోంది. రెజీనా కాసాండ్రా, ఖుష్బు, సుందర్ సి , మీనా, అభినయ, కూల్ సురేష్ నటీనటులు, చిత్ర సిబ్బంది పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. మూకుత్తి అమ్మన్ పాత్ర పోషించడానికి నయనతార ఉపవాసం ఉంది. అమ్మవారి త్రిశూలం తో ఫోటోలో దర్శనమిచారు.
 
నయనతార ఎరుపు రంగు చీరలో చాలా అందంగా కనిపించగా, దివ్యదర్శిని ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చింది. నయనతార వేదికలోకి ప్రవేశించగానే ఆమెకు ఘన స్వాగతం లభించింది. చిత్రం ప్రారంభానికి గుర్తుగా వేదిక వద్ద ఆచార పూజలు నిర్వహించారు. వేదికపైకి వెళ్లే ముందు ఆమె కార్యక్రమంలోని ప్రముఖులను పలకరించారు. దర్శకుడు సుందర్ సి రెజీనా కాసాండ్రా, దునియా విజయ్, గరుడ రామ్ మరియు యోగి బాబులను వేదికపైకి పరిచయం చేసి వారికి హృదయపూర్వక స్వాగతం పలికారు.
 
2020 నాటి 'మూకుతి అమ్మన్' చిత్రానికి సీక్వెల్ ఇది, నయనతార 'దేవత'గా తిరిగి రాబోతోంది. ఇటీవల విదాముయార్చిలో కనిపించిన రెజీనా కాసాండ్రా, మూకుతి అమ్మన్ 2లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడానికి ఎంపికైంది. ఇటీవలే వీరసింహారెడ్డితో తెలుగులోకి అడుగుపెట్టిన కన్నడ నటుడు, దర్శకుడు దునియా విజయ్, రాబోయే సీక్వెల్‌లో విలన్‌గా నటించి తమిళంలో అడుగుపెడుతున్నాడు.
 
యోగి బాబు, అభినయ, ఇనేయ, రామచంద్రరాజు, సింగంపులి, విచ్చు విశ్వనాథ్, అజయ్ ఘోష్, లొల్లు సభ స్వామినాథన్,  మైనా నందిని నటీనటుల జాబితాలో భాగమని సుందర్ సి ప్రకటించారు.  హిప్ హాప్ తమిళ  ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లకు  వెంకట్ రాఘవన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారు. గోపీ అమర్‌నాథ్  సినిమాటోగ్రాఫర్.
 
కాగా, నయనతార, యష్  చిత్రం టాక్సిక్, టెస్ట్, మన్నంగట్టి సిన్స్ 1960, రక్కాయి వంటి సినిమాల్లో నటిస్తోంది.