బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2018 (13:17 IST)

వరుడిపై ప్రియుడితో యాసిడ్ దాడి చేయించిన వధువు

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో దారుణం జరిగింది. వరుడిపై తన ప్రియుడితో యాసిడ్ దాడి చేయించిందోవధువు. ఈ దారుణం జనగామ జిల్లాలోని రఘునాథపల్లెలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీ

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో దారుణం జరిగింది. వరుడిపై తన ప్రియుడితో యాసిడ్ దాడి చేయించిందోవధువు. ఈ దారుణం జనగామ జిల్లాలోని రఘునాథపల్లెలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రఘునాథపల్లెకు చెందిన యాకయ్య అనే యువకుడితో అరుణ అనే యువతికి పెళ్లి నిశ్చమైంది. దీంతో వీరి పెళ్లి శుక్రవారం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో అరుణకు బాలస్వామి అనే యువకుడిని ప్రేమించింది. అదేసమయంలో యాకయ్యను పెళ్లి చేసుకోవడం అరుణకు ఇష్టంలేదు. 
 
దీంతో యాకయ్యతో తన పెళ్ళి చెడగొట్టేందుకు ప్రియుడు బాలస్వామితో దాడి చేసేలా అరుణ ప్లాన్ వేసింది. తమ ప్లాన్‌లో భాగంగా, యాకయ్యపై బాలస్వామి యాసిడ్‌ పోసి అగ్గిపుల్లగీసి నిప్పంటించాడు. దీంతో వరుడుకి 60 శాతం మేరకు కాలిన గాయాలయ్యాయి. 
 
ఆ వెంటనే యాకయ్యను గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, వధువు అరుణ్, ఆమె ప్రియుడు బాలస్వామిని అదుపులోకి తీసుకున్నారు.