శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (11:16 IST)

కుమార్తె వేరొక మతస్తుడిని ప్రేమించిందని.. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా?

మతం పిచ్చితో ఓ వ్యక్తి రాక్షసుడిగా మారాడు. తన కుమార్తెను ప్రేమించిన ఇతర మతస్తుడిని ఆ వ్యక్తి గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని రుఘువీర్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఢిల్లీకి చెందిన ర

మతం పిచ్చితో ఓ వ్యక్తి రాక్షసుడిగా మారాడు. తన కుమార్తెను ప్రేమించిన ఇతర మతస్తుడిని ఆ వ్యక్తి గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని రుఘువీర్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఢిల్లీకి చెందిన రఘువీర్ నగర్ ప్రాంతానికి చెందిన ముస్లిం యువతి (20), ఆదే ప్రాంతానికి చెందిన ఫోటోగ్రాఫర్ అంకిత్‌తో ప్రేమలో పడింది. ఈ ఇద్దరు మూడేళ్ల పాటు ప్రేమించుకుంటారు. 
 
ఈ ప్రేమకు యువతి తండ్రి వ్యతిరేకించాడు. మతం వేరు కావడమే ఇందుకు కారణం. అతనితో ప్రేమ వద్దని హెచ్చరించాడు. అయినా ముస్లిం యువతి ఫోటోగ్రాఫర్‌తో ప్రేమాయణం నడుపుతుండటంతో అంకిత్‌పై దాడికి పాల్పడ్డాడు. అంతేగాకుండా కత్తితో గొంతు కోశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.