సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 21 మార్చి 2021 (10:28 IST)

నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు: కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర ఛాయి తాగినా... పదవి ఇప్పిస్తాననో... పనులు ఇప్పిస్తాననో ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించినా ముక్కు నేలకు రాస్తానని టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి సవాల్ విసిరారు.

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.చేతకానివాడు, ఒక్క రూపాయి కూడా సహాయం చేయనివాడు చాలా మాట్లాడుతాడని.. చెల్లని రూపాయి అని ఎద్దేవా చేశారు.

పదవులు అమ్ముకుంటున్నారు, పనులు అమ్ముకుంటున్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

దాంతో స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య వార్ ముదురుతోంది.