శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (14:10 IST)

డోంట్ యు డేర్ స్ప్రెడ్ రూమర్స్, సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు వార్నింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు బుధవారం తీవ్ర గాయాలపాలయ్యాడనీ, అతడి కాలికి ఫ్రాక్చర్ అయినట్లు మీడియాలో వస్తున్న వార్తలను హిమాన్షు కొట్టి పారేశారు.
 
అతడు గుర్రం స్వారీ చేస్తూ కిందపడిపోయాననీ, అతడి కాలికి, శరీరంపైన అక్కడక్కడ దెబ్బలు తగిలినట్లు ప్రచారం జరిగింది. ఐతే ఇవన్నీ అవాస్తవాలని హిమాన్షు స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. డోంట్ యు డేర్ స్ప్రెడ్ రూమర్స్ అంటూ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు వార్నింగ్ ఇచ్చారు.