గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 17 జనవరి 2017 (16:42 IST)

ములాయం పరిస్థితి చూసి కేసీఆర్ ముందే జాగ్రత్త పడుతున్నారా? 2019 కేటీఆర్ టి.ముఖ్యమంత్రా?

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు పార్టీ స్థాపించిన ములాయం సింగ్ యాదవ్ కు కొడుకు అఖిలేష్ యాదవ్ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ ఏమిటో దేశమంతా చూస్తోంది. పైగా ములాయం నుంచి పార్టీతో సహా పార్టీ నిధులను కూడా లాగేసుకున్నారు అఖిలేష్. ఎన్నికల సంఘానికి ఇద్దరూ వెళ్లినా మెజార

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు పార్టీ స్థాపించిన ములాయం సింగ్ యాదవ్ కు కొడుకు అఖిలేష్ యాదవ్ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ ఏమిటో దేశమంతా చూస్తోంది. పైగా ములాయం నుంచి పార్టీతో సహా పార్టీ నిధులను కూడా లాగేసుకున్నారు అఖిలేష్. ఎన్నికల సంఘానికి ఇద్దరూ వెళ్లినా మెజారిటీ ఎటు వుంటే అటే కనుక అఖిలేష్ యాదవ్ కు పార్టీ గుర్తుతో పాటు పార్టీ కూడా ఆయనదే అయిపోయింది. ఇది తనకు సంతోషాన్నివ్వడం లేదని అఖిలేష్ చెపుతున్నారు. తన తండ్రిని పార్టీలోకి తీసుకువస్తానని కూడా చెపుతున్నారు. 
 
ఈ గొడవ ఇలావుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే 2019 ఎన్నికల్లో కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సంక్రాంతి భోగి నాడు రివ్యూ సమావేశంలో కేటీఆర్ పనితీరుపైన కేసీఆర్ పొగడ్తల వర్షం కురిపించారట. భుజం తట్టి... భలే పని చేస్తున్నావని కూడా అన్నారట. వ్యవహారం చూస్తుంటే... 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర బాధ్యతలను కుమారుడికి అప్పగించి కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పాలనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. మరికొందరైతే ములాయం పరిస్థితిని చూసి కేసీఆర్ ముందే జాగ్రత్తపడుతున్నారంటూ కామెంట్లు విసురుతున్నారు.