లాంగ్‌డ్రైవ్ వెళ్లారు.. ఇంటికి తెలిసిపోయింది.. ఆత్మహత్యాయత్నం చేశారు.. ప్రియుడి మృతి.. యువతి మాత్రం!?
ఇంటర్ చదువుతున్న వయస్సులో ప్రేమలో పడటం ద్వారా ఓ యువతి ప్రేమికుడిని కోల్పోయింది. కాలేజీకి వెళ్ళకుండా ప్రియుడితో కలిసి లాంగ్‌డ్రైవ్ వెళ్ళింది. కాలేజీకి రాలేదని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం ఇవ్వడంత
ఇంటర్ చదువుతున్న వయస్సులో ప్రేమలో పడటం ద్వారా ఓ యువతి ప్రేమికుడిని కోల్పోయింది. కాలేజీకి వెళ్ళకుండా ప్రియుడితో కలిసి లాంగ్‌డ్రైవ్ వెళ్ళింది. కాలేజీకి రాలేదని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం ఇవ్వడంతో భయంతో వణికిపోయింది.
ఇక ఇంటికెళ్తే తల్లిదండ్రులు ఏమంటారో ఏమోనని జడుసుకున్న ఆ యువతి.. ప్రేమికుడితో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో ప్రియుడు ప్రాణాలు కోల్పోయాడు. యువతి మాత్రం బతికి బయటపడింది. ఈ ఘటన నగర శివారులోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డిలోని ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన నవీన్ (23) ఓ ప్రైవేట్ పాఠశాలలో పీఈటీగా ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సంవత్సరం పాటు వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు.
కాగా ఇంటర్ చదువుతున్న బాలిక బుధవారం కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లింది. కళాశాలకు వెళ్లకుండా నవీన్‌తో కలిసి స్కూటీ బైక్‌పై జూపార్కుకు వెళ్లారు. అక్కడి నుంచి లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామంటూ స్కూటీపై బయలుదేరారు. బాలిక కళాశాలకు రాలేదనే విషయం కళాశాల నుంచి బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. ఈ క్రమంలో నవీన్ సెల్‌కు ఫోన్‌లు వచ్చాయి.
హైదరాబాద్ నుంచి బయల్దేరిన వీరిద్దరూ మొయినాబాద్‌కు వచ్చారు. గ్రామ సమీపంలో సురంగల్ రోడ్డు పక్కన ఉన్న ఓ పాడుబడ్డ రేకుల షెడ్డులోని ఓ గదిలో పైపుకు కేబుల్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. మెడకు వైరు బిగించుకున్న ఇద్దరూ రాయిపై నుంచి ఒకేసారి కిందకు దూకారు.
ఈ క్రమంలో నవీన్ మెడకు ఉరి బిగుసుకుంది. బాలిక మెడకు కట్టుకున్న వైరు తెగిపోవడంతో కింద పడింది. వెంటనే తేరుకున్న బాలిక నవీన్‌ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
భయంతో ఏం చేయాలో తోచక బాలిక రోడ్డుపైకి వచ్చి అరుస్తూ రోదిస్తుండడంతో స్థానికులు గదిలోకి వెళ్లి చూసేసరికి అప్పటికే నవీన్ మృతి చెందాడు. దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.