తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఒక్కసారిగా వెలుగుచూసిన మత్తుకళ్ళ సుందరి మోనాలిసాకు బాలీవుడ్ సినిమాలో నటించే అరుదైన ఛాన్స్ లభించింది. ఆమెకు బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా మూవీ ఛాన్స్ ఇచ్చారు. తాను దర్శకత్వం వహించే ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసాను హీరోయిన్గా తీసుకున్నారు. ఈ మేరకు మోనాలిసా తన తొలి చిత్రానికి సంతకం చేశారు.
తాజాగా ఈ విషయంపై చర్చించేందుకు స్వయంగా మోనాలిసా ఇంటికి దర్శకుడు స్వయంగా వెళ్లారు. సనోజ్ మిశ్రా ఆఫర్ చేసిన సినిమాలో నటించేందుకు అంగీకారపత్రంపై మోనాలిసా సంతకం చేశారు. ఈ సినిమా షూటింగ్‌కు ముందు ముంబైలో మోనాలిసాకు యాక్టింగ్ నేర్పించనున్నట్లు సమాచారం.
కాగా, మోనాలిసా భోస్లే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా జీవితాన్నే మార్చేసింది. మొన్నటివరకు సాధారణ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్న ఈ 16 ఏళ్ల మోనాలిసా.. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెట్టనున్నారు. కుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుని జీవితం సాగించే మోనాలిసా ఇప్పుడు.. తెరపై కనిపించనుంది. దీనంతటికీ కారణం సోషల్ మీడియానే.
కుంభమేళాకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్.. మోనాలిసాతో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయింది. దీంతో రాత్రికి రాత్రే ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియా ఎక్కడ చూసినా మోనాలిసా ఫోటోలు, వీడియోలే వైరల్ అవుతున్నాయి. దీంతో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. తాను తీయబోయే తర్వాతి సినిమాలో మోనాలిసాకు అవకాశం ఇచ్చారు.