1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (16:41 IST)

సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండుగ.. కేటీఆర్ పిలుపు

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్లకు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 
 
సెప్టెంబర్ 2న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్నారు. 
 
సెప్టెంబర్ 2న జెండా పండుగతో పాటు గ్రామ కమిటీలు, వార్డు కమిటీల నిర్మాణం చేయాలని సూచించారు. అదే రోజు సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
 
సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు గ్రామ, వార్డు కమిటీల ప్రక్రియ నిర్వహించాలని, సెప్టెంబర్ 12 నుంచి 20వ తేదీ లోపు మండల కమిటీలు,పట్టణ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
 
వీటి తర్వాత ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు సమక్షంలో జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక ఉంటుందని వివరించారు. సెప్టెంబర్ 20 తర్వాత రాష్ట్ర కార్యవర్గం ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. 
 
సెప్టెంబర్ ఆఖరులోపు ఈ కమిటీల నియామకాన్ని పూర్తి చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో 150 డివిజన్ల కు 150 డివిజన్ కమిటీలు ఉంటాయన్నారు.