బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (07:07 IST)

ఆ పాట వింటేనే ఆ కొండముచ్చు పాలుతాగుతోంది

''నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేతప్పా.. డుగ్గుడుగ్గుడుగ్గు డుగ్గుడుగ్గని..'' ఈ పాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట.. ప్రస్తుతం జంతువులను కూడా ఆకట్టుకుంటోంది.

వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లెలో ఓ కిరణాదారుడు కోతుల బెడదను నివారించేందుకు ఓ ఆడ కొండముచ్చుని తీసుకొచ్చాడు. దీనికి ఓ పిల్ల కొండముచ్చు కూడా ఉంది. అయితే వారం క్రితం అనారోగ్యంతో తల్లి చనిపోవడంతో పిల్ల కొండముచ్చు బాధతో ఏమీ తినడం లేదు.. తాగడం లేదు.

దీంతో ఈ యజమాని సెల్‌లో బుల్లెటు బండి పాటను వినిపించాడు. ఆ పాటలోని భాష, భావం అర్థంకాకపోయినా కొండముచ్చుకి మాత్రం బాగా నచ్చేసింది. ఆ పాట వింటూ.. చకచకా పాలు తాగేసింది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు ఈ పాట మనుషులకే కాదు.. జంతువులకు ఊపు తెప్పిస్తోందని చమత్కరిస్తున్నారు.