బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2023 (12:12 IST)

స్వతంత్ర అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఆత్మహత్య

kannaiah goud
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ స్వతంత్ర అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బరిలోకి దిగిన ఆయన తన ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కన్నయ్య గౌడ్‌కు ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థి గుర్తుల కింద రోటీ మేకర్‌ను కేటాయించింది. ఇంతలోనే ఆయన ఊరేసుని ప్రాణాలు తీసుకోవడం గమనార్హం. ఆయన వ్యక్తిగత కారణాలతోనే బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. 
 
దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరురుకుని కన్నయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. స్వతంత్ర అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ స్థానంలో పోలింగ్ నిర్వహించాలా వద్దా అనే అంశంపై ఎన్నికల నిర్వహణపై విధి విధానాలను అధికారులు ఖరారు చేస్తున్నారు.