ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆఫ్లైన్ తరగతులు: ఆర్జీయూకేటీ
కోవిడ్ థర్డ్ వేవ్, ఒమిక్రాన్ ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ తరగతుల కోసం వారికి ఒక ఆప్షన్‌ను ఇచ్చినట్లు ఆర్జీయూకేటీ అధికారులు తెలిపారు. ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ, ఒంగోలులో IIIT విద్యార్థులకు విడతలవారీగా ఆఫ్‌లైన్ క్లాసులను నిర్వహించన్నట్లు ఆర్జీయూకేటీ తెలిపింది.
ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆఫ్లైన్ తరగతులు ప్రారంభించబోతున్నట్లు ఆర్జీయూకేటీ తెలిపింది. ఇప్పటివరకు పదకొండు వందల మంది విద్యార్థులు ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ క్యాంపస్‌కు చేరుకున్నారట. ఈనెల 13వ తేదీ నుంచి.P1 విద్యార్థులకు..19 వ తేదీ నుంచి..E 3 విద్యార్థులకు ఆఫ్లైన్లో తరగతులు నిర్వహించనున్నట్లు తెలియజేయడం జరిగింది.
ఇక మార్చి రెండవ తేదీ లోపు.. E 1,E 2 విద్యార్థులకు ఆఫ్లైన్ తరగతులను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. అయితే కొంత మంది మాత్రం ఇటీవల ఆన్‌లైన్ క్లాసులను తొలగించాలంటూ తమకు మెయిల్ చేసినట్లుగా తెలియజేశారు. అందుకోసమే వారు పంపించిన వాటికి స్పందించి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని తెలియజేశారు.