శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 14 జులై 2017 (17:29 IST)

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న పూరీ గ్యాంగ్... శెలవుపై వెళ్లనున్న అకున్ సబర్వాల్

డ్రగ్స్ కేసులో అనూహ్యంగా టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన పూరీ జగన్నాథ్, అతని చుట్టూ వున్న గ్యాంగ్ ఇరుక్కోవడం ఇప్పుడు సంచలనమైంది. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ కేసులో ప్రముఖ హీరో పేరు బయటకు రావడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిప

డ్రగ్స్ కేసులో అనూహ్యంగా టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన పూరీ జగన్నాథ్, అతని చుట్టూ వున్న గ్యాంగ్ ఇరుక్కోవడం ఇప్పుడు సంచలనమైంది. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ కేసులో ప్రముఖ హీరో పేరు బయటకు రావడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్ గ్యాంగ్ ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది. సంబంధం వున్నా లేకున్నా పూరీ జగన్నాథ్, చార్మి, సుబ్బరాజు, నవదీప్... ఇలా అంతా పూరీకి బాగా టచ్‌లో వున్నవారి పేర్లు బయటకు రావడం షాకింగ్‌కు గురి చేస్తోంది.
 
మరోవైపు నోటీసులు అందుకున్న నటులు తమకు కనీసం సిగరెట్ తాగడం కూడా రాదని గట్టిగా వాదిస్తున్నారు. తమకు నోటీసులు ఎందుకు ఇచ్చారో నేరుగా కలిసి మాట్లాడాతమంటూ వెల్లడిస్తున్నారు. ఇంకోవైపు తమకు ఎలాంటి సంబంధం లేకున్నా మీడియాలో ఇష్టం వచ్చినట్లు స్క్రోలింగులు వేస్తూ తమ బతుకులను బజారుకీడుస్తున్నారంటూ నందు, తనీష్ హీరోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే డ్రగ్స్ కేసులో సినిమా సెలబ్రిటీల పేర్లు బహిర్గతంపై ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. విచారణ పూర్తికాక ముందే పేర్లు ఎలా బయటకు వచ్చాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎక్సైజ్ శాఖపై తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఆయన కొద్దిరోజులు శెలవుపై వెళ్లనున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.