శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (16:03 IST)

రామోజీరావుకి తీవ్ర అస్వస్థత... ఆసుపత్రిలో చేరిక...

ఈనాడు-ఈటీవీ గ్రూపు సంస్థల అధినేత, మీడియో మొఘల్ రామోజీరావు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు వెన్నునొప్పి కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఐ

ఈనాడు-ఈటీవీ గ్రూపు సంస్థల అధినేత, మీడియో మొఘల్ రామోజీరావు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు వెన్నునొప్పి కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఐతే మంగళవారం నాడు సమస్య మరీ తీవ్రం కావడంతో ఆయనను నగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. 
 
వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన స్వల్పంగా ఆహారం కూడా తీసుకున్నట్లు వైద్యులు వివరించారు. కాగా రామోజీరావు అనారోగ్యం అనే వార్త బయటకు రావడంతో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.