ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 6 మార్చి 2017 (07:11 IST)

హమ్మయ్య నయీంతో సంబంధం ఉందని ఒప్పేసుకున్నాడు.. వాడి మొహం కూడా నాకు తెలీదనలేదు.

సిట్‌ విచారణ సందర్భంగా నేతి విద్యాసాగర్‌ నయీం ఆగడాలతో తనకెలాంటి సంబంధం లేదని తోసిపుచ్చారు. నయీంతో స్నేహం ఉన్నా ఇతర లావాదేవీలేమీ లేవని, భూ దందాల్లో తనకెలాంటి ప్రమేయం లేదని వెల్లడించినట్లు తెలిసింది. ఇప్పటికే నయీం, నేతి మధ్య సంబంధాలున్నట్లుగా రూఢీ చేసే

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసు లో మళ్లీ కదలిక మొదలైంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తాజాగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ను ప్రశ్నించింది. నల్లగొండ జిల్లాలోని ఆయన నివాసంలోనే సిట్‌ అధికారులు దాదాపు మూడు గంటలపాటు ఆయనను విచారించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా నయీంతో ఉన్న సంబంధాలతో పాటు.. ఆర్థిక, భూసంబంధిత లావాదేవీలపై సిట్‌ ఆరా తీసినట్లు సమాచారం. విద్యాసాగర్‌ వాంగ్మూలాన్ని సిట్‌ రికార్డు చేసినట్లు తెలిసింది. భువనగిరికి చెందిన వ్యాపారి గంప నాగేందర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై సిట్‌ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే విచారణ చేపట్టినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

 
సిట్‌ విచారణ సందర్భంగా నేతి విద్యాసాగర్‌ నయీం ఆగడాలతో తనకెలాంటి సంబంధం లేదని తోసిపుచ్చారు. నయీంతో స్నేహం ఉన్నా ఇతర లావాదేవీలేమీ లేవని, భూ దందాల్లో తనకెలాంటి ప్రమేయం లేదని వెల్లడించినట్లు తెలిసింది. ఇప్పటికే నయీం, నేతి మధ్య సంబంధాలున్నట్లుగా రూఢీ చేసే ఫొటోలు, వీడియోలు సిట్‌ వద్ద ఉన్నాయి. వీటితోపాటు వివిధ కోణాల్లో పలు డాక్యు మెంట్లు, ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. తుక్కుగూడలో నయీం ఫామ్‌హౌస్‌లో జరిగిన పలు పార్టీల్లో నేతి పాల్గొన్నట్లుగా ఉన్న ఫొటోలు చూపించి.. అవి ఆయనవేనా కాదా.. అని సిట్‌ ప్రశ్నిం చినట్లు తెలిసింది. నయీం భార్య ఫర్హానా, విద్యాసాగర్‌ భార్య కలసి భూదందాలు నిర్వహించారా.. అన్న కోణంలోనూ విచారిం చినట్లు సమాచారం.
 
తుక్కుగూడ, భువన గిరి ప్రాంతంలో దాదాపు 28 ఎకరాల భూములు వీరిద్దరి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయిం చిన డాక్యుమెంట్లను సిట్‌ సేకరించింది. అవి నిజమైనవేనా.. ఇద్దరి పేరిట ఎందుకున్నాయని విచారణ సందర్భంగా సిట్‌ ఆరా తీసినట్లు తెలిసింది. ఆ డాక్యుమెంట్లకు తమ కెలాంటి సంబంధం లేదని విద్యాసాగర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విచారణకు సంబంధించిన వివరాలను సిట్‌ అధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు. తననెవరూ విచారించలేదని విద్యాసాగర్‌ వివరణ ఇవ్వ డం గమనార్హం.
 
ఈ నెల 10 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నయీం కేసులో అడుగు ముందు కేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆచీతూచీ వ్యవహరిస్తోంది. టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు నాయకులకు, కీలకమైన అధికారులకు నయీంతో సంబంధాలున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నివేదిక ఇప్పటికే సీఎం వద్దకు చేరింది. ఒకదశలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ను రాజీనామా చేయాలని సీఎం ఆదేశించినట్లుగా ప్రచారం జరిగింది. కానీ.. సొంత పార్టీ నేతలు, అధికారులపై చర్యలు తీసుకుంటే తమంతట తాముగా మచ్చ వేసుకోవటంతో పాటు...అనవసరంగా రాజకీయ విమర్శలకు తావిచ్చిన ట్లవుతుందని సీఎం వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ నేతలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో పోలీసు విభాగం ఈ కేసును నీరుగారుస్తోందనే విమర్శలు గుప్పు మంటున్నాయి.