సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (18:50 IST)

కేసీఆర్ 8 నెలల్లో 150 గదుల గడీని నిర్మించుకున్నారు : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన మంచి పని ఏదైనా ఉందంటే.. అది కేవలం 8 నెలలో 150 గదుల గడీని నిర్మించుకోవడమేనని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన మంచి పని ఏదైనా ఉందంటే.. అది కేవలం 8 నెలలో  150 గదుల గడీని నిర్మించుకోవడమేనని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన ఎల్బీనగర్‌లోని పల్లవి గార్డెన్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 
 
ఎనిమిది నెలల్లో 150 గదుల గడీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్మించుకున్నారని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారన్నారు. దళితులు, మైనార్టీలు, రైతులు, వికలాంగులను కేసీఆర్‌ మోసం చేశారని రేవంత్‌ ఆరోపించారు. తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆరే వికలాంగుల సంక్షేమ శాఖను ఏర్పాటుచేశారని అన్నారు. వికలాంగుల సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తాననన్నారు.