బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (14:01 IST)

ప్రయాణికులకు రైల్వే శుభవార్త.. దీపావళికి ప్రత్యేక రైళ్లు

దీపావళి పండుగ సీజన్‌లో ఏర్పడే రద్దీని దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్యరైల్వే నిర్ణయించింది. ఆ ప్రత్యేక రైళ్లనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ట్రైన్‌ నెంబర్‌ 08585 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే నెల నవంబర్ 2వ తేదీ మంగళవారం ప్రత్యేక రైలు నడపనున్నారు. ఇక ఈ రైలు ఆ రోజు 17.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.10 గంటలకు గమ్యం చేరుకుంటుంది.
 
రైలు నెంబర్‌ 08586 సికింద్రాబాద్ నుంచి విశాఖట్నం స్పెషల్ ట్రైన్ నవంబర్ 3న నడపనుంది సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ రైలు 03వ తేదీన 21.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 09.50 గంటలకు గమ్యం చేరుకోనుంది. 
 
రైలు నెంబర్‌ 08583 విశాఖపట్నం నుంచి తిరుపతికి నవంబర్ 1న ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ రైలు ఆ రోజు 19.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది. 
 
రైలు నెంబర్‌ 08584 తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు నవంబర్ 2న స్పెషల్ ట్రైన్ నడపనున్నారు రైల్వే అధికారులు. ఈ స్పెషల్ ట్రైన్ 2వ తేదీన 21.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.20 గంటలకు విశాఖ చేరుతుంది.