శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (11:59 IST)

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్‌

తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న సౌందర రాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. తమిళనాడు బీజేపీ చీఫ్‌గా సమర్థవంతంగా నిర్వహించిన ఆమెకు గవర్నర్ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు బీజేపీ ధ్రువీకరించింది. 
 
ఉన్నట్టుండి తమిళిసై సౌందర్‌రాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటి వరకైతే సోషల్ మీడియాలో తమిళిసైపై మీమ్స్ పేలేవి.
 
ఇక గవర్నర్ పదవిలో కేంద్రం ఆమెను కూర్చోబెడితే తమిళ తంబీలు ఆమెను ఏమేరకు ఏకిపారేస్తారో మరి. ఇప్పటికే తమిళిసై చేసే ప్రకటనల పట్ల తమిళ తంబీలు మీమ్స్ పోస్టు చేసేవారు. మరి ఇకనైనా ఆమె గవర్నర్ అయ్యారని ఇలాంటి జోక్స్, మీమ్స్ పేల్చడం ఆపుతారో లేదో వేచి చూడాలి.