వరదలతో కేరళ రైతులు నష్టపోయారు.. రుణ గడువును పెంచండి

rahul gandhi
ఎం| Last Updated: గురువారం, 15 ఆగస్టు 2019 (11:03 IST)
వరదలతో కేరళ రైతులు తీవ్రంగా నష్టపోయారని… చెల్లించాల్సిన రుణాల గడువును పెంచాలని భారత రిజర్వు బ్యాంకు గవర్నరుకు కాంగ్రెస్ నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఈ లేఖలో కేరళ రైతు రుణాల చెల్లింపుపై ఉన్న మారటోరియంను పొడిగించాలని కొరారు.

గతేడాది, ఈ ఏడాది వరుసగా కేరళను వరదలు కుదిపేసిన విషయనాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ దృష్టికి తీసుకెళ్లారు. వందేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు గతేడాది కేరళను ముంచాయన్నారు. వరుసగా రెండేళ్లపాటు వచ్చిన వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని… అందుకే డిసెంబర్ వరకు మారటోరియం గడువు పెంచాలని రాహుల్ తన లేఖలో కోరారు.దీనిపై మరింత చదవండి :