శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (15:09 IST)

ప్రశాంత కాశ్మీరం... శాంతిభద్రతలు భేష్‌‌‌‌: గవర్నర్‌‌‌

రాళ్లు విసరడం వంటి చెదురుమదురు సంఘటనలు మినహా జమ్మూ, కాశ్మీర్‌‌‌‌‌‌‌‌, లఢఖ్​ ప్రాంతాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లో కొన్ని షాపులు తెరుచుకున్నాయి. టూవీలర్లు, కార్ల మీద స్థానికులు తిరగడం అక్కడక్కడా కనిపించింది. 144 సెక్షన్‌‌‌‌‌‌‌‌ కొనసాగుతున్నా జనం నెమ్మదిగా రోడ్లమీదకు రావడం మొదలుపెట్టారని సీనియర్‌‌‌‌‌‌‌‌ అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల మాత్రం రాళ్లు విసరడం వంటి చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. 
 
కాగా, పూంఛ్‌‌‌‌‌‌‌‌ జిల్లా బఫ్లయిజ్‌‌‌‌‌‌‌‌  ఏరియాలో ఆందోళనకారులు రాళ్లు విసిరిన సంఘటనలో పొలీసు అధికారి ఒకరికి దెబ్బలు తగిలాయి. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లో నిరసనకారులు ఆందోళన చేసినట్టు వార్తలొచ్చాయి. ఆందోళన చేస్తున్న యువకుణ్ని పోలీసులు వెంటపడి తరుముతుండగా అతను జీలం నదిలోకి దూకి చనిపోయినట్టు అధికారులు చెప్పారు. ఆందోళనకారుల దాడుల్లో ఆరుగురు గాయపడ్డారని, వాళ్లు శ్రీనగర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌లో చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు.
 
370 ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ రద్దుతో రాజకీయ అవినీతి  తొలగిపోతుందని బోర్డర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కుప్వారా జిల్లా వాసులు ఆనంద పడుతున్నట్టు వీడియో క్లిప్‌‌‌‌‌‌‌‌ సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 370 ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ రద్దును నిరసిస్తూ కార్గిల్‌‌‌‌‌‌‌‌ పట్టణంలో మాత్రం బంద్‌‌‌‌‌‌‌‌ పాటిస్తున్నారు.  దీంతో కార్గిల్‌‌‌‌‌‌‌‌లో చిక్కుకున్న టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి జమ్మూకు ఒక్కొక్కరికి 2500 నుంచి 3000 వరకు టాక్సీ డ్రైవర్లు వసూలు చేస్తున్నట్టు టూరిస్టులు ఆరోపిస్తున్నారు.
 
కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ లోయలో 100 మందికి పైగా అరెస్టు
శాంతిభద్రతలకు  ఇబ్బందులు కలిగిస్తారన్న అనుమానంతో కాశ్మీరు లోయలో వందిమందికిపైగా రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తల్ని ఇంతవరకు అరెస్టు చేసినట్టు జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌ అధికారి ఒకరు వెల్లడించారు. అరెస్టయిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తి, ఒమర్‌‌‌‌‌‌‌‌ అబ్దుల్లా, జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌ పీపుల్స్‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ నాయకులు ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌ అన్సారీలను అరెస్టు చేసి గృహనిర్బంధంలో ఉంచారు. 
 
గవర్నర్ సమీక్షా సమావేశం..
జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో శాంతిభద్రతల పరిస్థితిని గవర్నర్‌‌‌‌‌‌‌‌ సత్యపాల్‌‌‌‌‌‌‌‌ మాలిక్‌‌ ఉన్నతాధికారులతో సమీక్షించి సంతృప్తి వ్యక్తంచేశారు. 370 ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ రద్దు తర్వాత  శాంతిభద్రతల పరిస్థితిపై రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. హాస్పటల్స్‌‌‌‌‌‌‌‌లో ఎమర్జెన్సీ సర్వీసులకు ఎలాంటి ఇబ్బందుల్లేవని రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధి చెప్పారు. నిత్యావసర సరుకుల సప్లై బాగానే ఉందన్నారు. కరెంట్‌‌‌‌‌‌‌‌, నీటి సప్లయ్‌‌‌‌‌‌‌‌కి ఇబ్బందుల్లేవని రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధి చెప్పారు. 
 
మారుమూల ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు అవసరమైన వస్తువులు అందుబాటులో ఉండేలా స్టాఫ్‌‌‌‌‌‌‌‌ను పురమాయించాలని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లను గవర్నర్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. టూరిస్టులుగాని, ఇతరులుగాని ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా.. దగ్గరున్న పోలీస్టేషన్లను కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలని లేకుంటే ఆయా జిల్లా కలెక్టర్ల దగ్గరకు వెళ్లాలని సత్యపాల్‌‌‌‌‌‌‌‌ మాలిక్‌‌‌‌‌‌‌‌ సూచించారు. గవర్నర్‌‌ సలహాదార్లు కె.విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, కె.స్కందన్‌‌‌‌‌‌‌‌, ఫరూక్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌, చీఫ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ బి.వి.ఆర్‌‌‌‌‌‌‌‌. సుబ్రహ్మణ్యం తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్మూ రీజన్‌‌‌‌‌‌‌‌లో పరిస్థితిని తెలుసుకునేందుకు మరొక సలహాదారుడు ‌‌‌‌‌‌ కె.కె.శర్మను గవర్నర్‌‌‌‌‌‌‌‌ నియమించారు.