కార్గిల్ విజయ్ దివస్.. మొక్కలు నాటిన గవర్నర్

biswa bhushan harichandan
ఎం| Last Updated: శుక్రవారం, 26 జులై 2019 (14:59 IST)
కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు విజయవాడలోని రాజ్‌భవన్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు చిరస్మరణీయ మైన రోజు. కార్గిల్ వార్‌లో అమరులైన వీర జవాన్లకు నివాళులు.

కార్గిల్‌లో అమరులైన వీర జవాన్ల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రధాని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. అమర వీరుల త్యాగానికి ప్రతీకగా దేశ ప్రజలు అందరూ కలిసి కట్టుగా ఉండాలని, దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి పౌరుడు ఐదు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని తెలిపారు.దీనిపై మరింత చదవండి :