కొత్త గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు ఘన స్వాగతం...

Biswa Bhusan Harichandan
ఎం| Last Updated: మంగళవారం, 23 జులై 2019 (15:26 IST)
తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్, ఆయన కుటుంబ సభ్యులకు మంగళవారం ఉదయం 11.40 గంటలకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్త, నగర పాలక కమిషనర్ పి.ఎస్.గిరీషా, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జెఈఓ బసంత్ కుమార్, మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి, వెస్ట్ డి‌ఎఫ్‌ఓ సునీల్ కుమార్ రెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్.పి.అన్బు రాజన్, తిరుపతి ఆర్.డి.ఓ. కనక నరసా రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ విజయసింహా రెడ్డిలు స్వాగతం పలికారు.

వీరితోపాటు సెట్విన్ సి.ఇ. ఓ. లక్ష్మీ, బిజెపి నాయకులు కోలాఆనంద్ స్వాగతం పలుకగా డీఎస్పీలు చంద్రశేఖర్, సాయి గిరిధర్, సిఐ అంజు యాదవ్, రెవెన్యూ డిటీలు ఈశ్వర్, శ్యాంప్రసాద్, ఇతర అధికారులు ఏర్పాట్లు పర్వవేక్షించారు. అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి రోడ్డు మార్గాన తిరుమల బయలు దేరారు. శ్రీవారిని దర్శించుకుని, ఆ తర్వాత మధ్యాహ్నం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుని 3.00 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి వెళ్లనున్నారు.దీనిపై మరింత చదవండి :