సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 27 మే 2019 (16:47 IST)

మోడీకి బొట్టు పెట్టి, హారతి ఇచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి

ప్రధాని నరేంద్ర మోడీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని రాక సందర్భంగా వెంకయ్యనాయుడు దంపతులు మోడీకి ఘనస్వాగతం పలికారు. వెంకయ్యనాయుడు సతీమణి ఉషమ్మ మోడీకి తమ ఇంటి ఇలవేల్పు అయిన వెంకటేశ్వరస్వామి తీర్ధ ప్రసాదాలు అందించి, నుదుట కుంకమ బొట్టు పెట్టి హారతి ఇచ్చారు. 
సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి రెండోసారి ప్రధాని పీఠం అధిరోహిస్తున్నందుకు మోడీని వెంకయ్యనాయుడు అభినందించారు. అనంతరం వీరు ఇరవురూ పలు రాజకీయ అంశాలు పట్ల చర్చించుకున్నారు.