బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 5 మే 2019 (10:49 IST)

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడుని కాల్చి చంపిన ఉగ్రవాదులు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారతీయ జనతా పార్టీకి చెందిన అనంతనాగ్ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుల్ మహ్మద్ మిర్ అలియాస్ అట్టల్‌ను తీవ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటన అనంతనాగ్ జిల్లాలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో వేరినాగ్ వద్ద జరిగింది. 
 
మిలిటెంట్ల కాల్పుల కారణంగా మిర్ ఛాతీ, ఉదర భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ... అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. 
 
కాగా 60 ఏళ్ల మిర్ హత్యపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ సోఫీ యూసఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2008, 2014 ఎన్నికల్లో జిల్లాలోని దూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసినట్టు గుర్తుచేసుకున్నారు. కాగా మిర్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.