తెదేపా ఎమ్మెల్యేలను శాశ్వతంగా బహిష్కరించాలి : శ్రీకాంత్ రెడ్డి
రాష్ట్ర శాసనసభ సమావేశాలు పూర్తయ్యేంత వరకు టీడీపీ సభ్యులను శాశ్వతంగా బహిష్కరించాలని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ మంగళవారం జరిగింది. సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది.
సస్పెన్షన్‌కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ను మంత్రి బుగ్గన ప్రతిపాదించారు.
అయితే టీడీపీ ఎమ్మెల్యేలు సభలోనే ఉండి నినాదాలు చేస్తున్నారు. అయితే వారిని సభా సమావేశాలు ముగిసే వరకూ కాకుండా సభా సంప్రదాయాలు పాటించని వారిని శాశ్వతంగా బహిష్కరించాలని చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.