ఏపీ అసెంబ్లీ : తెదేపా సభ్యులపై వేటు పడింది...  
                                       
                  
                  				  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య వివిధ అంశాలపై రసవత్తర చర్చ సాగుతోంది. అయితే, టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలను పదేపదే అడ్డుకుంటున్నారు. దీంతో సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 
				  											
																													
									  
	 
	ఈ నేపథ్యంలో ముగ్గురు తెదేపా సభ్యులపై ఉప సభాపతి కోన రఘుపతి వేటువేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పదేపదే అడ్డుకుంటున్నారన్న కారణంతో టీడీపీకి చెందిన అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడును బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు.