సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 14 జులై 2019 (11:37 IST)

మోడీ.. రొమ్ము విరుచుకుని నిల్చొనేలా చేశారు.. అందుకే బీజేపీలో చేరా : సుజనా చౌదరి

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తొలిసారి విజయవాడకు వచ్చారు. కాషాయ కండువా కప్పుకున్న తర్వాత ఆయన బెజవాడలో అడుగుపెట్టడం ఆయనకు ఇదే తొలిసారి. దీంతో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన సుజనాకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం కలిపారు. ఆ తర్వాత ఆయన నేరుగా వెళ్లి బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ, బిజెపిలో చేరే ముందువరకూ నేను పరోక్ష రాజకీయాల్లో ఉన్నాను. బిజెపి ప్రధాన ప్రత్యామ్నాయంగా అవతరించనుంది. ప్రధాని నరేంద్రమోడి ప్రణాళికలతో స్ఫూర్తి పొంది బిజెపిలో చేరాను. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్ళినా మన దేశ గౌరవాన్ని రొమ్ము విరుచుకుని నిలుచునేలా చేశారు. భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఏపీలో రాబోయే రోజులలో అత్యంత అవసరమయిన ప్రత్యామ్నాయంగా భావించి నేను బిజెపిలో చేరాను అని చెప్పుకొచ్చారు.