శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (14:38 IST)

బీజేపీలో చేరింది అందుకే: తేల్చి చెప్పిన అఖిలప్రియ సోదరుడు

కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా రెడ్డి సోదరుడు భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ప్రధాని మోడీ సమర్థ పాలన.. బీజేపీ భావాలునచ్చే తాను భారతీయ జనతా పార్టీలో చేరినట్లు తేల్చి చెప్పారు.
 
తనకు టీడీపీలో ఎలాంటి సభ్యత్వం లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో వైసీపీకి సరైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని 2024 నాటికి ఏపీలో కాషాయ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యమని కిశోర్ రెడ్డి జోస్యం చెప్పారు. తాను ఎలాంటి పదవులు ఆశించి బీజేపీలోకి చేరలేదని వివరణ ఇచ్చారు. 
 
దివంగత భూమా నాగిరెడ్డి అన్న కుమారుడైన కిశోర్ రెడ్డి గతంలో సోదరి అఖిలప్రియకు అండగా ఉంటూ తెదేపా తరపున పనిచేశారు. ఆయన బీజేపీలో చేరడంతో ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త గ్రూపులు మొదలయ్యాయని విశ్లేషకులు అంటున్నారు.