మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2017 (17:59 IST)

మోత్కుపల్లి నోట్లో 'బందరు లడ్డు'... ఎందుకని?

సహజమే. ఏదయినా మంచి వార్త వింటే మనవాళ్లు నోటిని తీపి చేస్తారు. స్వీట్ బాక్సులు పట్టుకుని వెళ్లి నోట్లో తీపి పదార్థాలను ఉంచుతారు. ఇప్పుడు తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నోట్లో కూడా బందరు లడ్డు స్వీటు పడ

సహజమే. ఏదయినా మంచి వార్త వింటే మనవాళ్లు నోటిని తీపి చేస్తారు. స్వీట్ బాక్సులు పట్టుకుని వెళ్లి నోట్లో తీపి పదార్థాలను ఉంచుతారు. ఇప్పుడు తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నోట్లో కూడా బందరు లడ్డు స్వీటు పడే అవకాశం ఎంతో దూరంలో లేదట. అదేంటి... బందరు లడ్డు అని అనకుంటున్నారా.. మరేంలేదు. ఆయనకు త్వరలో గవర్నర్ పోస్టు దక్కబోతోందని విశ్వసనీయ సమాచారం. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అనే వార్తలు వినబడుతున్నాయి.
 
కాగా వెంకయ్య నాయుడికి ఉపరాష్ట్రపతి పదవి దక్కడంపై తెలంగాణ తెలుగుదేశం నేతలు బంజారాహిల్స్‌ లోని వెంకయ్య నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. అభినందించిన నేతల్లో ఎల్‌.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, నామా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖర్‌రావు తదితరులు వున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యతో మాటామంతీ జరిగినప్పుడు మోత్కుపల్లికి త్వరలో తీపి కబురు అందుతుందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే మోత్కుపల్లికి గవర్నర్ పోస్టు అని చెపుతున్నారు.